వావ్.. అదిరే అభి.. అదిరిపోయిందిపో?

praveen
అతను ఒక యాంకర్.. కాదు కాదు డాన్సర్.. కాదండి కమెడియన్.. అయ్యో అతని గురించి చెప్పుకుంటూ పోతే ఎలా ఇంట్రడక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే యాంకర్ గా డాన్సర్ గా నటుడిగా కమెడియన్గా ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులను అలరించాడు అతను. జబర్దస్త్ కార్య క్రమంలో ఎన్నో ఏళ్లపాటు కమెడియన్ గా ప్రేక్షకులను అలరించి ఇప్పుడు మరో కామెడీ షో నవ్వులు పంచుతూ ఉన్నాడు. అతను ఎవరో కాదు అదిరే అభి. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అభి జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా సెట్ అయ్యాడు.


 ఇక దాదాపు కొన్ని ఏళ్లపాటు జబర్దస్త్ లో మంచి పాపులారిటీ ఉన్న టీం లీడర్ గా కొనసాగాడు అభి. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఇక జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే కార్యక్రమంలో టీం లీడర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సరికొత్త స్కిట్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అదిరే అభి ఇక ఈ సారి మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా స్ఫూఫ్ తో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడూ. ఇటీవల విడుదలైన కే జి ఎఫ్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఈ సినిమాను తనదైన శైలిలో స్ఫూఫ్ చేసాడు అదిరే అభి. అయితే కే జి ఎఫ్ సినిమా లో రాఖీ బాయ్ ఎవరికి భయపడకుండా అందరికీ ఎదురెళ్లి ధైర్యవంతుడు గా కనిపిస్తాడు. కానీ అదిరే అభి స్పూఫ్ లో మాత్రం రాఖీ బాయ్ గట్టిగా అరిస్తే భయపడే వ్యక్తి గా కనిపిస్తాడు. మరోవైపు అదిరే అభి అదీరా పాత్రలో నటించాడు. స్కిట్ లో భాగంగా ప్రతి పంచ్ కూడా బాగాతేలింది అనే చెప్పాలి. ఇది చూసిన తర్వాత ప్రేక్షకులు అందరూ పగలబడి నవ్వు కుంటున్నారు. అంతేకాదు వావ్ సూపర్ అదిరే అభి అదరగొట్టేసావ్ పో అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉండడం గమనార్హం. జబర్దస్త్ లోనే కాదు కామెడీ స్టార్స్ లో కూడా అదిరే అభి కామెడీ ఎక్కడా తగ్గలేదు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: