అబ్బో : త్రివిక్రమ్ కి పెద్ద పరీక్షే .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల ద్వారా కెరీర్ పరంగా వరుసగా హ్యాట్రిక్ సక్సెస్ లు కొట్టారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా మహేష్ కి జోడిగా యువ భామ కీర్తి సురేష్ నటిస్తుండగా థమన్ సంగీతాన్ని, మది ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఈ సినిమా పై మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉండగా ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ సూపర్ సక్సెస్ సాధించి సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి అనే చెప్పాలి.

కాగా ఈ సినిమా ఈ నెల 12న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా ఇన్నర్ టాక్ కూడా అదిరిపోతుండడంతో తప్పకుండా సర్కారు వారి పాట తో సూపర్ స్టార్ మరొక సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు. మరోవైపు తన తదుపరి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్నారు మహేష్.

ఒకవేళ ప్రచారం అవుతున్న విధంగా నిజంగానే సర్కారు వారి పాట పెద్ద సక్సెస్ అయితే, తనతో మహేష్ చేయబోయే సినిమా విషయమై త్రివిక్రమ్ కి ఒకింత అగ్ని పరీక్షే ఎదురవుతుందని, దానిని మరింత బాగా తీసే సక్సెస్ కొట్టేలా త్రివిక్రమ్ మరింత శ్రద్ధ తీసుకోవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఇప్పటికే ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాబౌయే ఈ సినిమాల ద్వారా తన ట్రాక్ ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనపడుతోందని అంటున్నారు. ఇక త్రివిక్రమ్, మహేష్ ల సినిమా భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా దానిని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: