తెలుగు ఆడియన్స్ కోసం మరొక సర్ ప్రైజ్ మూవీ ప్లాన్ చేసిన ఆహా..!!

Divya
ప్రస్తుతం ఎక్కువగా డిజిటల్ ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. అంతే కాకుండా సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడానికి కూడా పలు ఓటిటి సంస్థలు అందిస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఆహా కూడా ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త ఒరిజినల్ కంటెంట్ను అందిస్తూ ఇతర భాషలలోని సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఇప్పటికీ ఆహ లో తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలను డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఇలాంటి క్రమంలో తాజాగా మరోక తాజా చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది ఈ సంస్థ.

అదేమిటంటే ఫహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రలో నటించిన.. తోందిముతలం ద్రిక్షక్షియమ్ అనే చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. చిత్రం 2017లో మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఎంతో రాబట్టడమే కాకుండా అవార్డుల సైతం సాధించింది. ఇక మలయాళంలో ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఆ హాలు ఈ చిత్రం దొంగాట అనే పేరుతో విడుదల చేస్తున్నారు. మే 6 వ తేదీన ఆహా లో  స్ట్రీమింగ్ చేయనున్నారు.


దీంతో మలయాళ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన హీరో ఫాహద్ ఫాజిల్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పుష్ప చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పుష్ప సినిమా లో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. అయితే రాబోతున్న పుష్ప సీక్వెల్ సినిమాలో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ఇదివరకే తెలియజేయడం జరిగింది. మరి ఈ చిత్రంతో మరింత దగ్గరవుతారు ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: