సర్కార్ వారి పాట సినిమా నుంచి ట్రైలర్ రెడీ..!!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం.. సర్కార్ వారి పాట ఇ సినిమా కోసం ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది చెసుకుని త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంది. ఇటీవలే కళావతి సాంగ్, పేన్ని, టైటిల్ ట్రాక్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


ఇక అంతే కాకుండా యూట్యూబ్ లో రెండు సాంగ్స్ లు  కూడా విడుదల కగా దీంతో మహేష్ అభిమానులు ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. గడిచిన ఒక వారం నుంచి ఈ సినిమా మీదే ప్రతి ఒక్కరు మాట్లాడటం జరుగుతోంది. ఇక ఈ సినిమా ఈ నెల 12వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్ చాలా వేగంగా చేశారు చిత్ర బృందం.

తాజాగా సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి చిత్ర బృందం ఒక యూనిట్ ను సిద్ధం చేసింది. మే రెండవ తేదీ సాయంత్రం 4 గంటలకు సర్కారు వారి పాత సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ఒక  వీడియో ద్వారా విడుదల చేశారు చిత్ర బృందం. అయితే హైదరాబాదులోని కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్ లో అభిమానుల కోసం మూడు గంటలకి సినిమా ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఒక చిన్న గ్లింప్స్ కూడా టీజర్ కోసం విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: