ఆ హీరోల గురించి శృతిహాసన్ ఏం చెప్పిందో తెలుసా..?

Divya
తెలుగు ఇండస్ట్రీలో, తమిళం ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శృతిహాసన్ తో మొదట్లో చేసిన వారంతా ఒక బొమ్మలగా ఉంది అనుకునేవారు.. ఇక ఆకర్షించే అందం, కళ్ళు , చిన్ని పెదాలతో ఎంతో సుందరిగా కనిపించేది. మొదట్లో ఐరన్ లెగ్ అని కూడా ప్రచారం చేసిన వారు ఆ తరువాత ఆమె నటన చూసి షాక్ అయి పోయారు. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ అందులో సక్సెస్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.


రామయ్య వస్తావయ్య సినిమా లో అమ్ములు పాత్రలో అమాయకంగా నటించిన శృతి హాసన్ గబ్బర్ సింగ్ సినిమాలో భాగ్యలక్ష్మి గా చాలా బాగా నటించింది. ఎవడు సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించింది. అలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో నటించి అలరించింది. ఇక ఎలాంటి పాత్ర అయినా తన వంతు న్యాయం చేస్తూ ముందుకు సాగుతోంది శృతిహాసన్. సాధారణంగా హీరోలతో ఒక్క సినిమా కోసం హీరోయిన్ లు కలిసి ఎన్నో రోజులు పని చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. అలా వారి పై కొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం తాజాగా శృతి హాసన్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను తెలియజేసింది.


పవన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. ఆయన చాలా స్పెషల్ ఎంత సైలెంట్ గా ఉంటారో అంత నిండుగా కనిపిస్తారని తెలియజేసింది.

ఇక ప్రభాస్ తన ఒక స్టార్ అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి . మనకి కూడా ఆ విషయం గుర్తు రానంతగా కలిసిపోతారు అని తెలిపింది.

మహేష్ బాబు విషయానికి వస్తే తను నవ్వుతూ ఉండాలని అందరినీ నవ్విస్తూ చాలా స్టైలిష్ గా ఉంటాడు అని తెలియజేసింది.

ఇక ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ హీరో ఎంత సీరియస్ గా ఉంటారో.. గ్యాప్లో అంత సరదాగా ఉంటాడు అని తెలిపింది.

ఇక రామ్ చరణ్ , బన్నీ ఇద్దరు కూడ సెట్ లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: