సాయి పల్లవి పని అయిపోయినట్లేనా..!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలోకి తారాజువ్వలా దూసుకు వచ్చింది హీరోయిన్ సాయి పల్లవి. ఈమె తెలుగు సినిమా పరిశ్రమలోకి రాకముం దు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ నెలకొని ఉందని చెప్పవచ్చు. ప్రేక్షకులు కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఆ విధంగా ఆమె తెలుగులో సినిమా చేయాలనే డిమాండ్ భారీ స్థాయిలో నెలకొనగా శేఖర్ కమ్ముల ఈ డిమాండ్ ను గమనించి తెలుగులో ఫిదా సినిమా ద్వారా పరిచయం చేయించాడు. ఆ చిత్రం కాస్తా సూపర్ హిట్ అవడంతో సాయి పల్లవి కి మంచి పేరు వచ్చింది. 

అప్పటి నుంచి తెలుగులో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస చిత్రాలు అంగీకరిస్తూ వాటి ద్వారా మంచి ఇమేజ్ ను సంపాదిస్తూ అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా ఆమె చేసిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకోగా సాయి పల్లవి ఆ తర్వాత మళ్ళీ సినిమాలు ఇప్పటిదాకా ఒప్పుకోకపోవడం పై ఆమె అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మలయాళ సినిమా పరిశ్రమలో తన కెరీర్ ని మొదలు పెట్టి ఆ చిత్రాలతోనే అన్ని భాషలలోనూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ విధంగా తెలుగు తమిళ కన్నడ భాషలలో సైతం ఆమెకు మంచి క్రేజ్ రాగా ఇప్పుడు ఆమె సినిమాలు చేయకపోవడం అందరివి తీవ్రస్థాయిలో నిరాశపరుస్తుంది.

కారణం ఏదైనా కానీ ప్రేక్షకులను అలరించే నటిగా సాయి పల్లవి మంచి క్రేజ్ ను అందుకుంది. త్వరగా ఆమె తనకు వచ్చిన ఇబ్బందుల నుంచి కోలుకుని మళ్లీ సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమెతో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో మళ్లీ ఆమె చేసే సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు తెరపై ఆమె ను చూడాలో అని ఎదురు చూడటం ప్రేక్షకుల వంతు అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: