తెలుగు సినిమా పరిశ్రమను ఎన్నో భూతాలు పట్టిపీడిస్తుండగా మరొక భూతం కూడా ఎప్పటినుంచో తెలుగు సినిమా పరిశ్రమను ముందుకు దూసుకుపోనివ్వడం లేదు. అదే లీకు మహమ్మారి. తమ సినిమా గురించి ఏ విధంగా లీకులు అవుతాయో అన్న టెన్షన్ ప్రతి ఒక్క చిత్ర యూనిట్ లో ఉంది. అందరు కూడా తాము చేసే చిత్రం థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో విడుదల చేయాలని భావిస్తూ ఉంటారు కానీ కొంతమంది కావలనోనో లేక తెలియకనో తమ సినిమా లీక్ కావడానికి కారణం అవుతారు.
ఆ విధంగా లీకులు చేయడం సినిమా పరిశ్రమకు అలాగే సదరు సినిమా నిర్మాతకు భారీ నష్టాన్ని తీసుకువస్తుంది. ఇప్పటికే సినిమా పరిశ్రమకు చాలా రకాలుగా నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిత్ర యూనిట్ లోని కొంతమంది ఈ విధంగా తెలిసి తెలియక, కావాలని లీకులు చేస్తూ ఉండటం పట్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే విషయం తెలియకుండా ఉంది. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం చిత్ర నిర్మాతలు కావాలని తమ సినిమాకు సంబంధించిన లీకులు వదులుతున్నారు అని కొంతమంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు.
ఏ నిర్మాత అయినా తమ సొంత సినిమా ను లీక్ చేయాలనీ అనుకోడు. మరి ఇలాంటి వార్తలు రావడం వెనుక నిజం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది. తమ సినిమాకు కొన్ని ముఖ్యమైన లీకులు ఇచ్చి తద్వారా సినిమా యొక్క క్రేజ్ ను పెంచుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట వారు ఈ విషయాన్నీ కొంతమంది చెబుతున్నారు. పెద్ద నిర్మాత సైతం ఈ విధంగా ఆలోచించడం జరుగుతుందని అంటున్నారు. ఏదేమైనా ఈ విధంగా లీకులు జరగడం సినిమా పరిశ్రమకు మంచిది కాదని చెప్పాలి. ఇంకొక వైపు పైరసీ మహమ్మారి చిత్రపరిశ్రమను ఎప్పటినుంచో పీడిస్తుంది. ఇప్పుడు లీకులు అవడం మరో మహమ్మారి గా తయారైంది. మరి ఈ లీకుల బెడద లేకుండా సాఫీగా సినిమాలు విడుదల అవుతాయా ఇకనైనా అనేది చూడాలి. ప్రతి సినిమాకు ఏదో ఒక రకంగా లీకులు జరుగుతూనే ఉన్నాయి.