వెంకీ సినిమాకు డైరెక్టర్ దొరికాడా?

Satvika
తెలుగు అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్‌ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. ఎఫ్ 3లొ నటించారు. ఆ సినిమా షూటింగ్ ను పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.అయితే తదుపరి సినిమా కోసం ట్రై చేస్తున్నాడు. తనకూ ఎప్పటి నుంచో ఇష్టమైన వివేకానంద జీవితం ఆదారంగ సినిమా చేయాలనీ కోరిక ఉందట.వివేకానంద' కథతో సినిమా తీయాలన్నది వెంకటేశ్‌ కల.వివేకానంద బోధనల ప్రభావం ఆయనపై ఎంతగానో ఉందని, అందుకే ఆయన కథతో సినిమా చేయాలనుకుంటున్నా అని వెంకీ కొన్నేళ్లగా ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నారు.


ఈ కథకు తనను సెట్ అయ్యేలా చూపించె డైరెక్టర్ కోసం ఇన్నాళ్లు వెథికారు..ఆయన అభిరుచికి తగ్గ దర్శకుడు ఇప్పటికీ తారసపడకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ కాస్త డిలే అవుతుంది. గతంలో ఈ కథపై చర్చలూ జరిగాయి. నేషనల్‌ అవార్డ్‌ గ్రహీత నీలకంఠ స్ర్కిప్ట్‌పై కసరత్తులు చేశారు. అయితే ఆ పని సగం లో బ్రేక్ పడింది..అసలు ఆ కథ ఫూర్థి అవుతుందా? లేదా? అనే సందేహం లో పడిపొయారు. ఇకపొతే మరో డైరెక్టర్ కు బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు.


కాగా,మాస్ డైరెక్టర్ కొరటాల శివకుమార్ కు కూడా ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్..వివేకానంద కథతో సినిమా తీయాలనుందనీ, వివేకానందుడే ఆయనకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రపంచానికి ఈ కథ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అంటున్నారు. వెంకటేశ్‌, కొరటాల శివ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీరిద్దరూ కలిస్తే 'వివేకానంద' కథ తెరకెక్కే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇక వెంకీ, కొరటాల కలవడమే ఆలస్యం. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన 'ఆచార్య' విడుదల అయ్యింది ప్రస్తుతం మిస్రమ టాక్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చెయనున్నాడు. ఆ సినిమా తర్వాత వెంకీ తో సినిమా చెస్తారెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: