మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఆచార్య సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్... దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో తాను నటించబోయే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. గత కొంత కాలంగా రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది అంటూ అనేక వార్తలు బయటకు వస్తున్న విషయం మనకు తెలిసిందే, అయితే ఆ వార్తలకు తాజాగా రామ్ చరణ్ పులిస్టాప్ పెట్టేసాడు.
అయితే తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేను నటించబోయే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండదు అని, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నేను నటించబోయే సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కబోతుంది అని తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్, చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.