టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లను చేసే దర్శకుడిగా
బోయపాటి శ్రీను కి మంచి పేరు ఉంది. ఆయన తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తూ ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రం అఖండ చిత్రం కూడా దేశవ్యాప్తంగా
మాస్ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది. అలా ఇప్పుడు ఆయన చేయబోయే తదుపరి
సినిమా పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుస
సక్సెస్ లతో జోరు మీద ఉన్న
రామ్ పోతినేని తో ఆయన తన తదుపరి
సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ
సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే తప్పకుండా
బోయపాటి మార్క్
మాస్ మసాలా యాక్షన్ అంశాలు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాదు సెంటిమెంట్ పాళ్లు కూడా బాగానే ఉండబోతుంది అని అంటున్నారు. తన సినిమాలో భావోద్వేగానికి ఎక్కువగా పెద్దపీట వేస్తూ ఉంటారు
బోయపాటి శ్రీను. అలా పాన్
ఇండియా కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు సాగుతోందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి .
ఇప్పటిదాకా ఆయన ఈ తరహాలో
సినిమా చేయలేదు కానీ ఆయన సినిమాలన్నీ కూడా తప్పకుండా భారీ స్థాయిలో నిర్వహించే సినిమాలే. ఈ నేపథ్యంలో ఈసారి చేయబోయే
సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. అత్యంత భారీ బడ్జెట్ తో ఐదు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులకు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయాలని చూస్తున్నాడు.
రామ్ కూడా మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఆయన
వారియర్ అనే
సినిమా చేస్తున్నారు. ఇది కూడా పాన్
ఇండియా సినిమా కావడం విశేషం. మరి వీరిద్దరూ కూడా మంచి
సక్సెస్ జోష్ లో ఉన్న నేపథ్యంలో వీరు కలిసి చేయబోయే
సినిమా ఏ స్థాయిలో అవుతుందో చూడాలి.