
"పుష్ప 2" లో బాలీవుడ్ హీరో... కలిసి వస్తుందా ?
తాజాగా పుష్ప ది రైజ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారి గట్టి సక్సెస్ నే అందుకున్నారు స్టైలిష్ స్టార్. సుకుమార్ టేకింగ్ చేసిన విధానం బన్నీ అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్, రష్మీక పల్లెటూరి గడసరి అందం, డిఎస్పీ మ్యూజిక్ అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవడంతో రిజల్ట్ కూడా అంతే బాగా వచ్చింది. మొదట్లో కాస్త డల్ అనిపించినా ఈ చిత్రం ఆ తరవాత మళ్లీ ఊపందుకుని రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఊహించందాని కన్నా ఎక్కువ గానే రెస్పాన్స్ లభించింది. బాలీవుడ్ లోను బ్యాండ్ బాజా అంటూ అక్కడి చిత్రాలకు మించి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే పుష్ప పార్ట్ వన్ ఇంత పెద్ద హిట్ అవ్వడం తో ఇపుడందరి దృష్టి పుష్ప సీక్వెల్ పై పడింది.
ఈ సినిమాలోని నటీనటులు, కథ వంటి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి గా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబందించిన మరో న్యూస్ అటు బీ టౌన్ లో ఇటు టీ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. 'పుష్ప ది రూల్' చిత్రం లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ న్యూస్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే సౌంల్ శెట్టి నటించిన టాలీవడ్ చిత్రాలు హిట్ అయిన దాఖలాలు లేవు. ఇటీవల సునీల్ శెట్టి ప్రముఖ పాత్ర పోషించిన గని మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయింది. దీనితో ఇది ఎంత వరకు పుష్ప 2 కలిసి వస్తుందో చూడాల్సి ఉంది.