ఎన్టీఆర్ తో కొరటాల సినిమా కథ ఏంటంటే?
అయితే, రామ్ చరణ్ మాత్రం వరుస సినిమాలను చేస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ చెస్తూనె ఖాళీ సమయం లో మిగిలిన సినిమాలను చేస్తున్నారు.. ఆయన నటించిన ఆచార్య సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా వుంది.ఇక ఎన్టీఆర్ ఇప్పుడు మరో సినిమాలో నటించెందుకు రెడీ అయ్యాడు.డైరెక్టర్ కొరటాల శివ తో తదుపరి సినిమాను చేయనున్నారు.భరత్ అనే నేను' నుంచి 'ఆచార్య' వరకూ నాలుగేళ్ల తర్వాత మరో సినిమా విడుదల అవుతుండటం విశేషం.ఆచార్య' ఆలస్యం అవ్వడానికి రకరకాల కారణాలు. ఏదైతేనేం..? నాలుగేళ్లకు ఓ సినిమా అనేది అమోదయోగ్యం కాదు. ఇప్పుడు కొరటాలకు స్పీడు పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
ఎప్పుడూ మాస్ కథలతో సినిమాలను చేస్తున్న మన డైరెక్టర్ ఇప్పుడు మరో సినిమా కథను సిద్దం చేశారు. త్వరలో ఎన్టీఆర్తో ఓసినిమా చేయబోతున్న విషయాన్ని ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..ఈ సినిమా కథ ఎప్పుడో సిద్ధమైంది. కాకపోతే ఎలాంటి కథ అనే విషయంలో స్పష్టత లేదు. ఎన్టీఆర్తో ఏ కథ చేయబోతున్నారు? అని అడిగితే కనీవినీ ఎరుగని కథలో, ఇది వరకెప్పుడూ చూడని నేపథ్యంలో ఈ సినిమా అని కొరటాల ఊరిస్తున్నారు. జూన్ నెల మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.ఇకపోతే రామ్ చరణ్, మహేష్ బాబు తో సినిమాలు చేయడానికి కథలు కూడా సిద్దం చేశారు.ఏది ముందు సెట్స్ మీదకు వెలుతుందో చూడాలి..