అక్కినేని హీరోగా
సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి
హీరో గా దూసుకుపోతున్నాడు అఖిల్. ఆయన తొలి మూడు సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేదనే చెప్పాలి. నాలుగవ
సినిమా కొంత మెప్పించగా ఇప్పుడు 5 వ
సినిమా గా రాబోతున్న ఏజెంట్ చిత్రం తప్పకుండా భారీ విజయం సాధించాల్సిన అవసరం చాలా ఉంది.అలా భారీ అంచనాల మధ్య వచ్చిన
అఖిల్ తొలి
సినిమా అఖిల్ భారీ హోప్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మాస్ హీరోగా
అఖిల్ ను పరిచయం చేయించాలని చెప్పి
నాగార్జున ఎంతో ఇష్టపడి మరీ వినాయక్ దర్శకత్వంలో
అఖిల్ ను లాంచ్ చేయించగా ఆ చిత్రం కాస్త బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో బోల్తాపడింది.
ఈ చిత్రం ద్వారా
అఖిల్ కు మంచి పేరు రావడం పక్కన పెడితే ఉన్న క్రేజ్ కూడా పోయిందనే చెప్పాలి అలా ఇండస్ట్రీలో ఏ హీరోకి కూడా రానటువంటి షాకింగ్ ప్రారంభం
అఖిల్ కు దక్కింది. ఆ విధంగా రెండో
సినిమా కూడా ఎంతో ఒత్తిడిలో చేయగా ఆ చిత్రం కొంత వరకు పర్వాలేదు అనిపించుకుంది. కానీ
అఖిల్ స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేక పోయింది అని చెప్పాలి. ఇక మూడవ చిత్రం మిస్టర్ మజ్ను కూడా భారీ స్థాయిలో నిరాశపరిచింది. ఆ విధంగా
అఖిల్ నాలుగవ సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం చేయగా అది మోస్తరు విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలోనే
సినిమా పరిశ్రమలో నాలుగో చిత్రం తో తొలి
సక్సెస్ అందుకున్న
అఖిల్ ఆ సక్సెస్ను కంటిన్యూ చేయాలని చెప్పి ఏజెంట్ సినిమాతో పాన్
ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతవరకు తెలుగు
సినిమా పరిశ్రమలో
అఖిల్ విజయాన్ని సాధించింది లేదు ఇప్పుడు పాన్
ఇండియా స్థాయిలో కొట్టడం అంటే మాటలు కాదు. ఈ నేపథ్యంలోనే
అఖిల్ కు ఏజెంట్
సినిమా మంచి విజయాన్ని తెచ్చి పడుతుందా
ఇండియా స్థాయిలో ఆయనకు అపజయాన్ని తెచ్చిపెడుతుంది అనేది చూడాలి. ఈ సినిమాను
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తుండగా ఆయన పెద్ద హీరోలకు మంచి విజయాలు సాధించి పెట్టిన దర్శకుడు కావడం విశేషం.