ఆచార్య సినిమా నుండి నీలాంబరి సాంగ్ వీడియో వైరల్..!!

Divya
చిరంజీవి, రామ్ చరణ్, కాజల్, పూజ హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతం బిజీ లో అన్ని ఫార్వర్డ్ చేసి పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. నిన్నటి రోజున సాయంత్రం హైదరాబాదులో యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంగరంగ వైభవంగా జరిపారు. ఇక అంతే కాకుండా నీలాంబరి వీడియో సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆడియో పరంగా మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ పాటని వీడియో రూపంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

నీలాంబరి నీలాంబరి అంటూ సాగే ఈ మ్యూజిక్ మెలోడీ కి మణిశర్మ సంగీతం సమకూర్చారు. గేయ రచయిత అనంత శ్రీరామ్ ఇందుకు ట్యూన్ తగ్గట్టుగా అందమైన సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర పాటలు అవుట్డోర్ లొకేషన్ లో రామ్ చరణ్ , పూజ హెగ్డే ల మధ్య ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటున్నాయి. ఇక పూజా హెగ్డే అందచందాలు ఈ పాటకి హైలెట్గా నిలిచెలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడం జరిగింది.

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మించడం జరిగింది. ఇక ఈ చిత్రం ఒక నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సందేశాత్మక కథాంశంతో తెరకెక్కడం జరుగుతోంది. ఇందులో కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ , రామ్ చరణ్ , చిరంజీవి చేసే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించేలా కనిపిస్తున్నాయి. ఇందులో విలన్ గా సోనూసూద్ నటిస్తున్నారు. కమెడియన్ వెన్నెల కిషోర్,పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి నటిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషన్ కంటెంట్ అటు అభిమానులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: