"కేజిఎఫ్" సినిమా వెనుకున్న రహస్యం ఇదే?
ఈ సినిమాకు ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా పూర్తి అయిన రోజులలో స్టోరీ రెడీ చేసుకున్నాడట. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని ఎంతో అలోచించి చివరికి అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న మాములు హీరో యశ్ కు ఈ విషయాన్ని చెప్పాడట. అయితే కథను విన్న యశ్ వెంటనే సినిమా చేద్దాం అన్నారట. అలా యశ్ మరియు ప్రశాంత్ నీల్ జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందని తెలుస్తోంది. ఈ ఎనిమిది సంవత్సరాలు ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్క టెక్నీషియన్ మరియు నటీనటులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు.
ఇప్పుడు తెరమీద వీరందరి కష్టం కనబడుతోంది. ఈ సినిమాను ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరూ ఎంతగానో పొగుడుతున్నారు. ఈ సినిమా ఇచ్చిన ఫలితం కారణంగా ప్రశాంత్ నీల్ మరియు యశ్ లు పాన్ ఇండియా స్థాయిలో హైలైట్ అయ్యారు. ముందు ముందు భారీ అవకాశాలు వీరికి దక్కనున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఒక సినిమాను పూర్తి చేయగా, త్వరలో ఎన్టీఆర్ తో మరో మూవీ పట్టాలెక్కనుంది.