మరో సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ..

Satvika
అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకు పెరిగి పోతుంది..ఒక్కో సినిమాతో ఒక్కో విధనంగా తనలోని నటనను చూపిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు.అంతే కాదు ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్నారు.ఇలా ఒక్కో సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ స్తైలిష్ స్టార్ హీరో అయ్యాడు..నటనతో పాటు, బన్నీ వేస్తున్న డ్యాన్స్ కు జనాలు ఫిధా అవుతున్నారు..సరైనోడు సినిమా బన్నికి అనుకున్న ఫలితాన్ని అందించలేదు. దాంతో తర్వాత సినిమా లకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇటీవల పుష్ప  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..


సుకుమార్ దర్షకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే..రష్మిక మందన్న కథానాయకిగా నటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అల్లుఅర్జున్ ఈ సినిమాలో కనిపించాడు. మాస్ లుక్ లో కనిపించాడు..మొత్తానికి సినిమా కథ పరంగా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యింది.. అన్నీ ప్రాంతాల్లో మంచి టాక్ తో పాటుగా, భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది..పుష్పగా అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఫ్యాన్స్ బలంతోనే ప్రముఖ యాడ్ లలో నటించే అవకాశాన్ని అందుకున్నాడు.


ఇప్పుడు మరో సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు.రెడ్ బస్ తన అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ప్రకటించింది. గతంలో అర్జున్ 2017లో రెండు సంవత్సరాల పాటు రెడ్ బస్ అంబాసిడర్‌గా విధులు నిర్వర్తించాడు. రెండేళ్ల విరామం తర్వాత రెడ్ బస్ మళ్లీ అల్లు అర్జున్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడానికి ప్రధాన కారణం పుష్ప అని తెలుస్తుంది. ఈ విషయం అల్లు అర్జున్ మాట్లాడుతూ..మళ్ళీ రెడ్ బస్ కు అంబాసిడర్ గా చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఇకపోతే.. ఇప్పుడు బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజిగా ఉన్నాడు.. ఆ సినిమాను కూడా వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: