నందమూరి ఫాన్స్ ప్రస్తుతం మల్టీస్టారర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే
బాలయ్య,
జూనియర్ ఎన్టీఆర్,
కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో
సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇదిలావుండగా అఖండ ప్రమోషన్స్ లో భాగంగా
బాలకృష్ణ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా
జూనియర్ ఎన్టీఆర్ కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధమేనని కామెంట్లు చేయడం జరిగింది. ఇకపోతే
ప్రవీణ్ సత్తారు ముగ్గురు నందమూరి హీరోలతో సినిమాను తెరకెక్కించడానికి అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని.ఇక ఆ ప్రాజెక్ట్ కు ఎన్బీకే అనే టైటిల్ ఫిక్స్ అయిందని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.
కాగా పాన్
ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న
జూనియర్ ఎన్టీఆర్ కథ మరీ అద్భుతంగా ఉంటే తప్ప
ప్రవీణ్ సత్తారుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు. అయితే
బాలయ్య సైతం షోలే
సినిమా అంత పవర్ ఫుల్
మూవీ అయితే మాత్రమే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తానని వెల్లడించారు. కాగా ఎవరైనా స్టార్
డైరెక్టర్ కృషి చేస్తే మాత్రం నందమూరి మల్టీస్టారర్ సాధ్యం కావడం కష్టం కాదని చెప్పవచ్చు.అయితే
బాలయ్య ఎన్టీఆర్ మధ్య మాటలు లేవని కొంతమంది ప్రచారం చేస్తున్నా ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. అంతేకాకుండా
బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఉండే కథతో దర్శకులు కథ సిద్ధం చేస్తే..
ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమైతే కాదని చెప్పవచ్చు. ఇదిలావుండగా ప్రస్తుతం
బాలయ్య,
ఎన్టీఆర్ వేర్వేరుగా సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇక బాలయ్య తర్వాత సినిమాలకు గోపీచంద్ మలినేని,
అనిల్ రావిపూడి దర్శకులుగా ఫిక్స్ కాగా
జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లు
కొరటాల శివ మరియు ,
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.ఇకపోతే
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార త్వరలో రిలీజ్ కానుంది. అంతేకాకుండా నందమూరి హీరోలు తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...!!