ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్న ఆచార్య?

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నెల్లుగా జనాలను ఆసక్థిగా ఎదురు చూసెలా చేసిన సినిమా అంటే ఆర్ఆర్ఆర్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎటువంటి సినిమా అయిన కూడా అందరినీ ఆలోచనలో పడవెస్తుంది.. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించడం,సరికొత్త కథలతో లో సినిమాలను చేయడం వల్ల సినిమాలకు జనాల్లో మంచి డిమాండ్ వుంటుంది.. మొన్నీ మధ్య వచ్చిన రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ గురించి అందరికి తెలిసిందే...ఆ సినిమా విడుదల అయ్యి అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా కలెక్షన్స్ ను అందుకుంది..


ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవ్వడం విశేషం. తాజాగా మరో సినిమా కూడా ట్రిపుల్ ఆర్ ను ఫాలో అవుతుందని తెలుస్తుంది.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా గురించి తెలిసిందే. ఆచార్య చిత్రం టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' రూట్‌లో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆచార్య సినిమాను కూడా ఆర్ఆర్ఆర్ తరహాలోనే భారీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మెకర్స్..ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.


ఆర్ఆర్ఆర్ సినిమా రన్ టైమ్ 3 గంటలకు పైగా ఉంటుంది. ఆచార్య సినిమాను కూడా అంతే రేంజ్‌లో వుండాలని అనుకున్నారు.. అందుకే రన్ టైమ్ ను 2 గంటల 46 నిమిషాలకు దించారు.కొరటాల శివ చిత్రాల్లో ఇప్పటివరకు ఇంతటి రన్‌టైమ్‌తో సినిమాలేవీ రాలేదు. మరి నిజంగానే ఆచార్య సినిమా ఇంతటి భారీ రన్‌టైమ్‌తో వస్తుందా లేక ఇది కూడా కేవలం పుకారుగానే మిగిలిపోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించడం వల్ల సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.. సినిమా ఎలా వుంటుందో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: