పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతవకాలం పాటు మూవీ లకు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ గ్రౌండ్ గా వఖిల్ సబ్ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. వఖిల్ సబ్ మూవీ మంచి విజయం సాధించడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలను ఓకే చేస్తూ వచ్చాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా కొంత కాలం క్రితమే విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ మూవీ లో రానా కూడా హీరోగా నటించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చి కూడా చాలా కాలమే అవుతుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు ఉండబోతున్నారు అని ఫిలిం నగర్ లో ఓ టాక్ జోరుగా ప్రచారం అవుతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే ను చిత్ర బృందం కన్ఫామ్ చేసింది. మరి మరో ఇద్దరు హీరోయిన్ లు ఎవరు అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాలేజీ లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చ బోతున్నాడు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.