పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒకటే ప్రశ్న ఎదురవుతుంది అదే ఆయన పెళ్లి.ఇకపోతే తాజా గా రిలీజ్ అయిన రాధేశ్యామ్ తో వెనకడుకు పడ్డా.. అంతే స్పీడ్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఒపిగ్గా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. అయితే యంగ్ రెబల్ స్టార్ ఎదురైనప్పుడల్లా.. మీడియా ప్రతినిధులు ప్రభాస్ సార్ మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తూనే ఉంటారు.అయితే దీంతో ప్రభాస్ అసౌకర్యంగా భావించడం ఎన్నో సందర్భాల్లో కనిపించింది. ఇకపోతే అయినా వారు ప్రశ్నిస్తూనే ఉంటారు.ఇక ఈ క్రమంలో తాజాగా మరో మారు పెళ్లిపై ప్రశ్నను ప్రభాస్ ఫేస్ చేశారు.
అయితే గతం లో ప్రభాస్ పెళ్లి గురించి చాలా రూమర్స్ వినిపించాయి.అంతేకాదు వైజాగ్ అమ్మాయితో ప్రభాస్ పెళ్ళిఅంటూ గతంలో ఓ మాట వినిపించింది. ఇక ఆ తరువాత అనుష్క శెట్టికి, ప్రభాస్ కు మధ్య లవ్ ఉందంటూ రూమర్ గట్టిగా నడిచింది. ఇక అసలు విషయం ఏంటంటే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భంగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. అయితే ఎక్కడికి వెళ్లినా తనను దీనిపైనే అడుగుతుంటారని ప్రభాస్ చెప్పారు.ఇక దీన్ని పట్టించుకుంటారా అని న్యూస్ ప్రతినిథులు అడిగారు.. ఇకపోతే దానికి సమాధాణంగా ప్రభాస్ లేదని బదులిచ్చారు.
అయితే నాపెళ్ళి గురించి అడిగినప్పుడు నాకేమీ చిరాకు అనిపించదు. అంతేకాదు ఇది జనరల్ గా ఎదురయ్యే ప్రశ్నే. అయితె మీ స్థానంలో నేను ఉన్నా దీనిపై నాకు ఆసక్తి ఉంటుంది అని సింపుల్ గా సమాధానం చెప్పారు.దీనితోపాటు . త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారా అని ప్రశ్నించగా..ఆయన దీనికి సమాధానం నా దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా చెపుతానంటూ..ప్రభాస్ పెద్దగా నవ్వేశారు.ఇక దీంతో ప్రభాస్ తన పెళ్ళి గురించి ఇప్పట్లో ఎవరూ ఆలోచరించవద్దు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అయ్యింది. అయితే ఆయన పెళ్లి కోసం అభిమానులు ఇంకా వెయిట్ చేయక తప్పేట్లు లేదు...!!