యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా విజయోత్సాహం లో ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన చేసిన కొమరం భీమ్ పాత్ర ప్రేక్షకులు ఎంతో మెప్పించింది. అద్భుతమైన హావభావాలను పలికించి ప్రేక్షకులను ఎంతో అలరించారు ఎన్టీఆర్. అభిమానులు సైతం ఎన్టీఆర్ ను ఏ స్థాయిలో చూడాలి అనుకున్నారో ఆ స్థాయిలో కనిపించి ప్రేక్షకులను మరియు తన అభిమానులను ఎంతగానో సంతోష పరిచాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్థాయి వేరే రేంజ్ లో పెరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసింది అని చెబుతున్నారు.
కారణం ఏదైనా కూడా వారికి నచ్చకపోవడం అనేది చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే ఆయన తదుపరి సినిమా విషయం పై కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా యొక్క ప్రకటన చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటన చేశాడు. అయితే ఆ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా కూడా ఇప్పటి దాక ఈ సినిమా యొక్క ప్రారంభం నుంచి ఎలాంటి అప్డేట్ లేదు దాంతో అభిమానులు ఇప్పుడు అసహనంతో రగిలి పోతున్నారు. ఏ హీరో అభిమానులకు ఇలాంటి కష్టం రాకూడదని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్సాహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటు కొరటాల శివ కూడా తన తదుపరి సినిమా ఆచార్య విడుదల పనులలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు ఉండగా ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందనే ఆందోళన అభిమానులలో ఉంది. తొందరగా తమ హీరో సినిమా పూర్తి చేస్తే చూడాలని ఉంది అని వారు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఏదేమైనా తన తదుపరి సినిమాలను పట్టలెక్కించడం లో ఎన్టీఆర్ పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి. ఇతర హీరోలు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నాలుగైదు సినిమాలను ప్రారంభం చేస్తూ తమ అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తు ఉంటే ఎన్టీఅర్ మాత్రం అలా చేయలేకపోయాడు.