కేజీఎఫ్ 2 : ఇక గడిచిన రెండు వారాలకు పైగా ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ ను కూడా ఏలుతూ 1000 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన "ఆర్ఆర్ఆర్" సినిమా దూకుడుకు బ్రేకులు పడ్డాయి.ఇక ఎన్నో భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన "కేజీఎఫ్" చాప్టర్ 2 ప్రేక్షకులను ఫిదా చేయడంతో, ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతోంది."ఆర్ఆర్ఆర్" సినిమా లాగానే "కేజీఎఫ్2" కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో, ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులను నమోదు చెయ్యనుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో "బాహుబలి 2" సినిమాను దాటుకుని, నెంబర్ 1 స్థానంలో నిలిచిన "కేజీఎఫ్" చాప్టర్ 2 ఆల్ టైం ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులో టాప్ 3లో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనపడుతోంది.మిగిలిన అన్ని ఏరియాలలో కూడా సూపర్ టాక్ తో దూసుకుపోతున్న "కేజీఎఫ్" చాప్టర్ 2 డబ్బింగ్ బొమ్మలలో భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే సినిమాగా ఈ సినిమా నిలవనుంది.
అటు యుఎస్ ప్రీమియర్స్ లో కూడా 1 మిలియన్ డాలర్స్ పైగా సాధించి, ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. చూడబోతుంటే భారీ విజయం "కేజీఎఫ్ 2" సినిమా సొంతమయ్యేలా కనపడుతోంది."బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్" వంటి సౌత్ ఇండియన్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండడం నిజంగా శుభపరిణామం అని చెప్పుకోవాలి.ఇక చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకి బ్రేకలు వేద్దామని విడుదల అయిన తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి సినిమా బీస్ట్ తొలిరోజే బొక్క బోర్లా పడింది. కంటెంట్ చాలా రొటీన్ గా ఇంకా వీక్ గా ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజే బీస్ట్ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది.