"రామ్ చరణ్ - ఎన్టీఆర్" లకు ఉన్న ఆస్తులివే?
చరణ్ కు కార్లు అంటే చాలా ఇష్టం. చరణ్ గ్యారేజ్ లో ఉన్న కార్లు లిస్ట్ చూస్తే... ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారును ఆయన తరచూ వినియోగిస్తూ ఉంటారు. ఈ కార్ ను తన తండ్రి చిరంజీవి గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా చెర్రీ వద్ద 3.34 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్, 3.5 కోట్ల రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కార్లు అలాగే..
మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ, ఎస్‌యూవీ కూడా చెర్రీ గ్యారేజ్ లో ఉంది. దీని ధర అక్షరాలా రూ.80 లక్షలు.
ఇక తారక్ గ్యారేజిలో ఉన్న కార్ల లిస్ట్ కూడా తక్కువేమీ కాదు. కార్లంటే ఎన్టీఆర్ కి చాలా ప్రీతి. ఇటీవలే ‘లంబోర్ఘిని’ యూరుస్ గ్రాఫైట్ మోడల్ కారును తారక్ ఆర్డర్ చేసారు. ఈ మోడల్ కార్ ను మన దేశంలోనే కొన్న తొలి వ్యక్తి తారక్ కావడం విశేషం. దీని ఖరీదు ఏకంగా 3.16 కోట్లు. ఈ కార్ తో పాటుగా మెర్సీడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ, రేంజ్ రోవర్ వోగ్యూ ఎస్‌యూవీ కార్లు కూడా తారక్ గ్యారేజ్ లో వున్నాయి. అలాగే పోర్షే 718 కేమ్యాన్‌ను 85.95 లక్షలు పోసి కొనుగోలు చేశారు తారక్. ఇక ఎన్టీఆర్ రెగ్యులర్ గా వాడే కారు బీఎండబ్ల్యూ ఎల్‌డీ కారు ధర 1.32 కోట్లు.
జూనియర్ ఎన్టీఆర్‌కు రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా వుందట. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే ఈయనకు ట్రూజెట్ పేరిట సొంతంగా ఎయిర్‌లైన్ కంపెనీ ఉన్న విషయం తెలిసిందే. తారక్ కి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన భవనం, అలాగే బెంగళూరు, కర్ణాటక రాష్ట్రాలలోను లగ్జరీ భవనాలు ఉన్నాయి.
రామ్‌చరణ్ హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్‌లో ఈ మధ్యే ఓ ఇల్లు కొనుగోలు చేశారు. దీని విలువ రూ.30 కోట్లకు పైనే ఉంటుంది. రామ్‌చరణ్, చిరంజీవిలకు పలు చోట్ల విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. రామ్ చరణ్ తేజ్ ఆస్తుల విషయానికి వస్తే ఆయన ఆస్తుల విలువ రూ.1300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే ఈయన ఆస్తుల విలువ రూ.444 కోట్లు ఉంటుందని అంచనా.