కెజిఎఫ్ చాప్టర్ 2 : మైండ్ బ్లాక్ : అసలు ఇలా తీసారేంటబ్బా .... ??
ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన కేజేఎఫ్ చాప్టర్ 2 మూవీ అందరి నుండి మంచి టాక్ ని సొంతం చేసుకోవడం విశేషం. చాప్టర్ 1 ని మించేలా మరింత గ్రాండ్ గా భారీ స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తీశారు అని, అలానే రాఖీ భాయ్ పాత్రలో హీరో యాష్ నటన అదిరిపోయిందని, విలన్ గా చేసిన సంజయ్ దత్ సహా మిగతా పాత్రల్లో నటించిన వారందరూ కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారని పలువురు ప్రేక్షకాభిమానులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, డైలాగ్స్, మదర్ సెంటిమెంట్, ఆకట్టుకునే కథనం, ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వంటివి సినిమాలో ఎంతో బాగున్నాయని, ముఖ్యంగా మాస్ తో పాటు యువత తప్పకుండా ఈ సినిమాకి మరింత భారీ విజయాన్ని అందించడం ఖాయం అని మరికొందరు అంటున్నారు. మరోవైపు ఈసినిమా తెలుగు వర్షన్ కి కూడా సూపర్ గా టాక్ వినిపిస్తోంది.
తెల్లవారుఝామున యుఎస్ఏ, యుఏఈ వంటి దేశాల్లో షోలు వేయడం అక్కడి షోలు చూసిన మన తెలుగు వారు పాజిటివ్ గా రివ్యూస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సినిమాలో పెద్దగా బోర్ కొట్టే సీన్స్ లేవని, అయితే సెకండ్ హాఫ్ ప్రారంభంలో ఒక ఇరవై నిమిస్తాలు నెమ్మదిస్తుందని, మిగతా సినిమా మొత్తం కూడా ఒక పెద్ద గ్రాండియర్ గా తీసారని, సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ పడ్డ కష్టం తెలుస్తుందని కొందరు విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా సినిమాని ఎంతో బాగా తీసారని, రాబోయే రోజుల్లో ఈ కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ భారీ కలెక్షన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని వారు అంటున్నారు.