వావ్.. శ్యామల నీలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Satvika
డ్యాన్స్ కు ఈ మధ్య భలే డిమాండ్ ఉన్న విషయం అందరికి తెలిసిందే..దాంతో ఎవరూ చూసిన డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళ డ్యాన్స్ బాగుంటే నెట్టింట చక్కర్లు కోడుతుంది.. లేదంటే కామెంట్లు అందుకుంటుంది.. ఇకపోతే ఈ మధ్య టీవీ యాంకర్లు కూడా అదిరిపొయె స్టెప్పుల తో డ్యాన్స్ ఇరగదీస్తున్నారు.. వాటికి వస్తున్న కామెంట్లను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు యాంకర్ శ్యామల ఓ పాటకి అదిరిపొయె స్టెప్పులేసింది. ఎప్పుడూ పద్ధతిగా కనిపించే అమ్మడు ఇలా చేయడం పై అందరు ఆష్చర్యానికి గురవుతున్నారు..


ఈ ముద్దుగుమ్మకు పెద్దగా పరిచయం అక్కర్లేదు...టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షన్లకు తనదైన స్టైల్‌లో యాంకరింగ్‌ చేస్తుంటుంది..ఆమె అందానికి ఫిదా అయిన దర్షక నిర్మాతలు సినిమాలో నటించె అవకాశాన్ని కూడా అందించారు..టీవీ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పలు సీరియల్లో కూడా నటించి తనదైన ముద్ర వేసుకుంది. ఇప్పుడు యాంకరింగ్ తో పాటు ఏం చెప్పారు శ్యామల గారు.. అనే ఓ యూట్యూబ్ చానెల్ కూడా స్టార్ట్ చేశారు.


బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.ఆమె అందంతో ఆర్జివి మతి పొయ్యెలా చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా వుండే శ్యామల అభిమానులను మరింత ఆకట్టుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు..ఈ మేరకు తాజాగా ఒక డాన్స్ వీడియో ని పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది. జీన్స్ ప్యాంట్, బ్లాక్ డాట్స్ ఉన్న వైట్ టీ షర్ట్ లో డ్యాన్స్ ఇరగదీసింది.. శ్యామల ఇలా కూడా చెస్తుందా అని అందరూ ఆశ్చర్య పోతూన్నారు. ప్రస్థుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.మీరు కూడా ఓ లుక్ వేసుకోండి...


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: