'గని' మూవీ రిజల్ట్ గురించి స్పందించిన వరుణ్ తేజ్..!

Pulgam Srinivas
వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, జగపతి బాబు, నదియ,  నవీన్‌ చంద్ర, నరేశ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మాతలుగా , కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో  తమన్‌ సంగీతంలో తెరకెక్కిన సినిమా గని.
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ, టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ను తెచ్చుకున్న యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌,  తాజాగా వరుణ్‌ తేజ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలి సారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో,   హైప్‌భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్‌ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది,  ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా  గురించి వరుణ్ తేజ్ స్పందించాడు.   ఇంత కాలంగా మీ ప్రేమను ,  ఎఫెక్షన్ ను నాపై చూపించినందుకు చాలా సంతో షంగా ఫీలవుతున్నాను, 'గని' మూవీ  మేకింగ్  లో పాలుపంచుకున్న వారందరికీ  థ్యాంక్స్ చెబుతున్నాను.  ఎంతో ఫ్యాషన్ తో ఈ మూవీ కోసం హార్డ్ వర్క్ చేశాము, కానీ  మా ఐడియా అక్కడో మేము అనుకున్నట్టుగా రీచ్ కాలేదు.

నేను  మిమ్మల్ని అప్పుడు ఎంటర్టైన్ చేయాలనే అనుకుంటాను,  ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు నేను సక్సెస్ అవుతాను .. మరి కొన్ని సార్లు నేర్చుకుంటాను .. కానీ కష్టపడం మాత్రం ఎప్పటికీ ఆపను" అని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్  ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఎఫ్ 3  సినిమా లో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమా లో వరుణ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ మెహరీన్ కథానాయికగా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: