కేజిఎఫ్ చాప్టర్ 2: "క్లైమాక్స్ లో పూనకాలే..." ?

VAMSI
ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్‌ను బాగా షేక్ చేస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా అప్ డేట్స్, అలాగే గాసిప్స్‌తో అయితే ఫుల్ సోషల్ మీడియా నిండిపోయింది అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఇప్పుడు తన షూటింగ్ ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయటానికి రెడీగా ఉంది, అంతే కాదు కొంత మందికి అయితే మాత్రం ఈ సినిమా ముందుగానే చూసే అవకాశం కూడా వచ్చింది. అయితే ఉమైర్ సంధు తన ఇన్‌స్టాగ్రామ్ లో కేజీఎఫ్ చాఫ్టర్ 2 పై తన రివ్యూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు.

ఆయన తన రివ్యూను షేర్ చేస్తూ... ఇలా రాశారు. "ఉత్కంఠ రేపే సన్నివేశాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్స్ సీన్స్.. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ సూపర్ , మ్యూజిక్.. బీజీఎం కూడా ఇంకా అదిరిపోయాయి. హీరో యష్ టెరిఫిక్‌గా నటిస్తే.. ఇక సంజయ్ దత్ నటన అయితే అవుట్ స్టాడింగ్ అంటూ ఆయన రివ్యూ ఇచ్చాడు. ఇక  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్బుతంగా కేజీఎఫ్ 2ను తెరకెక్కించారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సీన్ కూడానూ అదిరిపోయిందన్నారు. సినిమాను  చూస్తున్నంత సేపు తన చూపును పక్కకి తిప్పుకోలేకపోయాను అన్నారు. అలాగే  కేజీఎఫ్ సినిమా ఓ టైఫూన్‌కు సమానంగా ఉంటుంది అన్నారు.

ఈ సినిమా కేవలం శాండల్‌వుడ్‌ బ్లాక్ బస్టర్‌ మాత్రమే కాదు.. ఇది ఒక వరల్డ్‌ క్లాస్‌ మూవీ అన్నారు. ఇక క్లైమాక్స్‌ విషయానికి వచ్చినట్లయితే అందరికి షాకిస్తుంది అని ఉమైర్‌ సంధు చెప్పారు. హీరో యశ్‌తో పాటు మిగతా నటీ  నటులు కూడా తమ నటనతో అదరగొట్టారని చెప్పారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ ను ఖచ్చితంగా షేక్ చేస్తుందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ సినిమాను తమిళం, కన్నడ, హిందీ, తెలుగు మరియు మలయాళ భాషలలో 2022 ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లో యశ్, సంజయ్ దత్‌లతో పాటు శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, అలాగే  ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్ లు కీలక పాత్రలు చేస్తున్నారు.

కేజీఎఫ్‌ సినిమాతో  హీరో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అంతే కాదు ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 పై కూడా భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల కోసం అభిమానులు అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రికార్డును తిరగరాస్తుందా ? బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాలుస్తుందా ? అనే విషయం తేలాలి అంటే మనం మరో  రెండు రోజులు  వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: