అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది, హీరోయిన్ గా పరిచయం అయిన మొదటి సినిమా తోనే సోనాక్షి సిన్హా బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. దబాంగ్ ఎం9వై తో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనాక్షి సిన్హా ఆ తర్వాత అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది , ఇది ఇలా ఉంటే సోనాక్షి సిన్హా ఆ మధ్యన సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన లింగ సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ సోనాక్షి సిన్హా మాత్రం తన నటనతో ప్రేక్షకులను అలరించింది.
ఇది ఇలా ఉంటే సోనాక్షి సిన్హా ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం పోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది, ఇది ఇలా ఉంటే తాజాగా సోనాక్షి సిన్హా కు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది... అసలు విషయంలోకి వెళితే... సోనాక్షి సిన్హా ‘ది ఖత్రా ఖత్రా’ అనే షో లో పాల్గొనడానికి వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లింది, అప్పుడు అక్కడ బాత్రూమ్ నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. సోనాక్షి సిన్హా అతన్ని చూసి షాకైంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అని సోనాక్షి సిన్హా అడిగింది, అతను నేను మిమ్మల్ని కలవడానికి నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉంటున్నానని తెలియజేశాడు. అతను మాట్లాడుతూ బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు, తన చేతిపై ఉన్న సోనాక్షి అనే పచ్చబొట్టును చూపించాడు. ఆ ప్రదేశంలో ఉన్న అద్దంపై లిప్ స్టిక్ తో ఐ లవ్ యు అని రాశాడు, తాను రక్తంతో కూడా అలా రాస్తానని చెప్పడంతో సోనాక్షి సిన్హా కాస్త భయపడింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే గొంతు కోసుకుంటానని చెబుతూ జేబులో నుండి కత్తి ని తీసుకున్నాడు, దాంతో సోనాక్షి సిన్హా భయపడి గార్డ్స్ అంటూ కేకలు పెట్టింది. సోని టీవీ ఈ వీడియోని తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. షో లో భాగంగా సోనాక్షి సిన్హా కు తెలియకుండానే సదరు ప్రాంక్ చేసినట్లు తెలుస్తుంది, ఇలా సోనాక్షి సిన్హా తాజాగా విచిత్రమైన సంఘటన ఎదుర్కొంది.