కేజీ ఎఫ్ 2 తో ప్రభుత్వాలకు అనుకోని సమస్యలు !
ఈ పరిస్థితులు ఇలా ఉండగా వచ్చే వారం విడుదల కాబోతున్న ‘కేజీ ఎఫ్ 2’ నిర్మాతలు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టిక్కెట్ల రేట్ల విషయంలో ఇచ్చిన పెంపుదల తమకు కూడ వర్తింప చేయమని అడిగే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ‘కేజీ ఎఫ్ 2’ మూవీ కూడ అత్యంత భారీ సినిమా అనీ తమ సినిమా నిర్మాణానికి కూడ 250 కోట్ల ఖర్చు అయిందని ఈ మూవీ నిర్మాతలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు ఇవ్వబోతున్నారట.
దీనితో ఈ మూవీ విషయమై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. అయితే ‘కేజీ ఎఫ్ 2’ మన తెలుగు సినిమా కాదు. ఆసినిమా టిక్కెట్ల రెట్లు అనుమతులు ఇస్తే తమిళ హీరో విజయ్ మూవీ నిర్మాతలకు కూడ తమకు కూడ టిక్కెట్ల రేట్ల పెంపుదల విషయమై సహకరించమని అడిగే అవకాశం ఉంది.
ఆతరువాత వచ్చే ‘ఆచార్య’ నిర్మాతలు కూడ ఇదే పద్ధతి అనుసరించే ఆస్కారం ఉంది. వీరందరి కోర్కెలు ప్రభుత్వాలు మన్నిస్తే మహేష్ ‘సర్కారి వారి పాట’ క్యూలో ఉంటుంది. దీనితో ‘కేజీ ఎఫ్ 2’ నిర్మాతల అభ్యర్ధన ప్రభుత్వాలు అంగీకరించే ఆస్కారం లేదని అంటున్నారు. ‘గని’ కి ఏవరేజ్ రిజల్ట్ రావడంతో వచ్చే వారం విడుదల కాబోతున్న ‘కేజీ ఎఫ్ 2’ ‘బీస్ట్’ సినిమాల పోటీ అత్యంత ఆశక్తి దాయకంగా మారింది అనడంలో సందేహం లేదు..