అలాంటి పాత్రలు హీరోలు చేస్తే ఆదరిస్తారు కానీ హీరోయిన్లు చేస్తే ఆదరించారు...అనన్య పాండే..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో లింగ వివక్షత ఉంది అని ఇప్పటికే ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ ముద్దుగుమ్మలు బహిరంగంగానే స్టేట్మెంట్ లు ఇచ్చేశారు,  అందులో భాగంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు పెద్దగా ఆదరణ చూపించరు అని కొంత మంది హీరోయిన్ లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.  హీరోలకు ఉన్నంత క్రేజ్ హీరోయిన్ లకు ఉండదు అని కొంత మంది ముద్దుగుమ్మల వాదన,  ఇప్పటికే కొంత మంది హీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న లింగ వివక్షత పై బహిరంగంగానే కామెంట్లు చేశారు.  కొంత కాలం క్రితం అందాల ముద్దుగుమ్మ తాప్సీ హీరోల సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు,  కానీ లేడీ ఓరియెంటెడ్ మూవీ లను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు అని లింగ వివక్షత పై తాప్సి కామెంట్ లను చేసింది.  


ఇది ఇలా ఉంటే తాజాగా లింగ వివక్షత అనన్య పాండే పై కామెంట్లు చేసింది,   అనన్య పాండే లింగ వివక్షత పై కామెంట్లు చేస్తూ హీరోయిన్ లు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తే ప్రేక్షకులు పెద్దగా వాటిని ఎంకరేజ్ చేయరు,  కానీ అదే హీరో లు కొత్త ప్రయత్నాలు చేస్తే  ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు అని అనన్య పాండే చెప్పుకొచ్చింది.  హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లు చేస్తే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు,  కానీ హీరోయిన్ చేస్తే మాత్రం ప్రేక్షకులు వాటిని పెద్దగా ఆచరించరు అని అనన్య పాండే చెప్పుకొచ్చింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనన్య పాండే డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కుతున్న లైగర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది,  ఈ సినిమాతో అనన్య పాండే తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది, ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: