కిలాడి
సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకులను నిరాశ పరచడం తో దాని ప్రభావం
రవితేజ పై ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ఒప్పుకున్నా సినిమాలను చూస్తుంటే ఆయనకు ఇంకో రెండు ఫ్లాప్ లు వచ్చినా ఆయనను ఆపే వారే లేరని చెప్పొచ్చు.
యువ హీరోల కంటే మరింత వేగంగా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న
రవితేజ పోకడ కొంత మందిని ఎంతగానో ఆశ్చర్య పరుస్తుంది. అయితే అయన నటించిన ఖిలాడి
సినిమా నిరశాపరచడం అందరిని ఆశ్చర్యపరు
స్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కావడం సహజమే.
అలాంటి
సినిమా తప్పకుండా భారీ విజయాన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి సమయంలో సరైన ఫలితం లేకపోతే దాని ప్రభావం కచ్చితంగా
హీరో తదుపరి
సినిమా పై ఉంటుంది. కానీ
రవితేజ విషయంలో అదేమీ జరగడం లేదు. అయన హీరోగా నటించబోయే తదుపరి చిత్రం రామారావు ఆన్ డ్యూటీ పై క్రేజ్ కొంత తక్కువ ఉంటుంది. కానీ ఈ
సినిమా విషయంలో ఖిలాడి ఫలితం ఎలాంటి ప్రభావం చూపక పోవడం విశేషం. ఆయన హీరోగా ప్రతిష్టాత్మకంగా నటించిన
సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలవగా ఈ
సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోగా కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఆ విధంగా ఇప్పుడు నాలుగు క్రేజీ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.
శరత్ దర్శకత్వంలో చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ
సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
జూన్ 17వ తేదీన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుండగా ఆ తర్వాత రావణాసుర సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక తాజాగా
రవితేజ మరిక
సినిమా మొదలుపెట్టారు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీస్తూ వుండగా ఈ చిత్రంలో ఆయన లీడ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ
సినిమా లాంఛనంగా ప్రారంభించారు. ఈ
సినిమా కోసం 50 కోట్లు బడ్జెట్ ను పెట్టబోతున్నారు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఇది ఉండగా ఈ
సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి