ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీ హీరోలు తమిళం ఇండస్ట్రీ దర్శకులతో సినిమాలు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం.అయితే ఇప్పటికే రామ్ .. లింగుస్వామితో కలిసి ది
వారియర్ అనే
సినిమా చేస్తున్నాడు. అసలు విషయంలోకి వెళితే గోపీచంద్ కూడా ఓ
తమిళ దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం వినిపిస్తోంది.అయితే సింగం సిరీస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు
హరి ఈయన మాస్, యాక్షన్ కథలకు ఆయన పెట్టింది పేరు. ఇకపోతే ముఖ్యంగా
పోలీస్ కథలు. ఇక సింగం, సింగం 2, సింగం 3. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి వసూళ్లు అందుకున్నాయి.
తాజాగా ఇప్పుడు
హరి ఓ కథ తయారు చేశాడని, అది గోపీచంద్ కి అయితే బాగుంటుందని అనుకుంటున్నాడని, ఇక ఈ కథ విషయమై.. గోపీచంద్ తో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది.ఇకపోతే గోపీచంద్ కూడా హరితో
సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడని టాక్. అయితే ఇది కూడా పోలీస్స్టోరీనే అని తెలుస్తోంది. గోపీచంద్ నటించిన `పక్కా కమర్షియల్` త్వరలోనే విడుదల కానుంది. ఈలోగా ఇక ఈ కథ సెట్టయిపోతే, గోపీచంద్ చేసే తదుపరి
సినిమా ఇదే అవుతుంది.అయితే మ్యాచో
హీరో గోపీచంద్‌తో దర్శకుడు
మారుతి చేస్తున్న తాజా చిత్రం 'పక్కా కమర్షియల్'.
ఇకపోతే మెగా
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌లో
ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు.ఇక ఇప్పటికే విడుదలైన ఈ
మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా అలాగే ఈ
మూవీ టైటిల్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది.అయితే జులై 1, 2022న పక్కా ఎంటర్టైన్మెంట్తో వస్తున్నామంటూ మేకర్స్ ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇకపోతే
మారుతి డైరెక్షన్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో రాశీ ఖాన్నా హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఈ మూవీలో సత్యరాజ్, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి జేకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు...!!