త్రివిక్రమ్ విషయంలో మహేష్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా...?

murali krishna
మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా వచ్చే నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుందట.పరశురామ్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.

అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత తెరకెక్కుతున్న సినిమా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఈ ఏడాది ఎండింగ్ లో మహేష్ సినిమాను మొదలుపెడతానని జక్కన్న ఇప్పటికే స్పష్టం చేశారు కూడా.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ జూన్ నెల నుంచి మొదలుకానుందని సమాచారం.. అయితే ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని మహేష్ బాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసే సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.

 

థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్లు సిద్ధమయ్యాయని సమాచారం.వరుస విజయాలతో జోరుమీదున్న త్రివిక్రమ్ ఈ సినిమాతో గత సినిమాలను మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని అందరూ భావిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోందని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి జక్కన్న సినిమాతో బిజీ కావాలని మహేష్ భావిస్తున్నారట.అయితే త్రివిక్రమ్ సినిమా విషయంలో మహేష్ బాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి..

 

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందట.. మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది.. సినిమాసినిమాకు మహేష్ బాబు త్రివిక్రమ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: