సలార్ : ఆ స్టారే కావాలని పట్టుబట్టిన ప్రభాస్, ప్రశాంత్ నీల్!

Purushottham Vinay
'సలార్'
 సినిమాలో ప్రభాస్ కి ధీటుగా జగపతి బాబు రాజ్ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. 'సలార్' లో ప్రభాస్-జగపతిబాబు పాత్రల మధ్య వచ్చే సీన్స్ మంచి ఇంటెన్స్ మోడ్ లో ఉంటాయని సమాచారం తెలుస్తోంది.ఇంకా కొన్ని పాత్రలకు సంబంధించిన వివరాల్ని యూనిట్ సీక్రెట్ గా ఉంచింది. అయితే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముందుగా ఓ కీలక పాత్రకి లాక్ చేసిన విషయం తెలిసిందే. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడం సహ పృథ్వీ రాజ్ ఇతర కమిట్ కారణాలుగా 'సలార్' సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.దీంతో ఆ రోల్ ని ఎవరితో పుల్ ఫిల్ చేస్తారు? అన్న ప్రచారం అప్పట్లో సాగింది. అయితే ప్రభాస్ ఇంకా ప్రశాంత్ నీల్ పట్టుబట్టి పృథ్దీరాజ్ నే మళ్లీ ఒప్పించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మలయాళం స్టార్ రివీల్ చేయడం జరిగింది. ప్రశాంత్ నీల్ తో పాటు.. 'సలార్' సినిమా నిర్మాతలతో మంచి పరిచయం ముందు నుంచి ఉంది. 'కేజీఎఫ్' సినిమాని మలయాళంలో నేనే రిలీజ్ చేసాను.




గత ఏడాదే 'సలార్' సినిమాలో నటించాలని ప్రశాంత్ అడిగారు.రోల్ నచ్చడంతో నేను కూడా అంగీకరించాను. కానీ తర్వాత వేర్వేరు కారణాలతో సహా డేట్ల సమస్య అనేది తలెత్తడంతో నేను తప్పుకున్నాను. కానీ తర్వాత ప్రశాంత్ తో పాటు ..ప్రభాస్ కూడా స్వయంగా నన్ను కలిసి సినిమా చేయాలని నన్ను అడిగారు. దీంతో తప్పక డేట్లను సర్దుబాటు చేసుకుని 'సలార్' సినిమా కోసం ఒప్పుకున్నానని తెలిపారు. పృథ్వీరాజ్ మొదటి సారి తెలుగులో 'పోలీస్ పోలీస్' అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ తెలుగు ఆయన సినిమా చేయలేదు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ 'సలార్' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించబోతున్నారు.'సలార్' సినిమా లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లో భాగంగా ఇద్దరి మధ్య కీలక సన్నివేశాలు షూట్ చేశారు. శ్రుతి హాస్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: