ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ ల వద్ద ఆర్ ఆర్ ఆర్ సినిమా మేనియా స్పష్టంగా కనిపిస్తోంది, ఆ రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా , ఆలియా భట్ , ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా నటించారు , ఈ సినిమాలో సముద్ర ఖని , అజయ్ దేవ గన్ , శ్రీయ ప్రధాన పాత్రలో నటించగా, ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు, ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు.
మొదటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది, విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బాస్టర్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ల్ లను కొల్లగొడుతూ కొత్త కొత్త రికార్డ్ లను సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా నైజాం ఏరియాలో ఓ రేంజ్ లో కలెక్షన్ లను కొల్లగొడుతోంది, నైజాం ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమా 70 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే పదకొండవ రోజు నైజాం ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు 2. 18 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది , ఇది ఇలా ఉంటే 11 రోజులకు గాను నైజాం ఏరియాలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు 99. 17 కోట్ల కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తుంది.