సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, రజనీ కాంత్ తమిళ నాట ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని స్టార్ హీరోగా కొనసాగినప్పటికీ రజనీ కాంత్ తమిళ్ పాటు తెలుగు లో కూడా అదే రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రజనీ కాంత్ నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి తెలు లో కూడా బ్లాక్ బస్టర్ విజయలను అందుకొన్నాడు, తెలుగు ఇండస్ట్రీ లో కూడా రజిని కాంత్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇలా తమిళ్ మాత్రమే కాకుండా ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ గత కొంత కాలంగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో మాత్రం కాస్త స్లో అయ్యాడు, రజినీ కాంత్ చివరగా నటించిన 'అన్నాత్తే' సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పర్వాలేదు అనిపించుకుంది.
ఇదే సినిమాను తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేశారు, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రజనీ కాంత్ కు చెల్లెలు పాత్ర లో కీర్తి సురేష్ నటించింది, ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ తన 169 వ సినిమాను త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ మూవీ కి దర్శకత్వం వహించాడు, ఈ సినిమా ఏప్రిల్ 13 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి , ఈ మూవీ కి అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అయిన శివకార్తికేయన్ అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు ఒక వార్త వైరల్ అవుతుంది, ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.