అక్కినేని కుటుంబం 200 కోట్ల వైపు అడుగులు !

Seetha Sailaja
టాప్ హీరోలు అంతా వారు నటించిన సినిమాలను 100 కోట్ల క్లబ్ లో చేర్చుకోగలుగుతున్నారు. ఆఖరికి నందమూరి సింహం బాలకృష్ణ కూడ లేటెస్ట్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అయితే ఈవిషయంలో అక్కినేని కుటుంబానికి చెందిన టాప్ హీరో నాగార్జున కల మాత్రం నెరవేరడం లేదు. అయితే నాగ్ నేటితరం అభిరుచులకు అనుగుణంగా అనేక సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు విజయవంతం అయినప్పటికీ 100 కోట్ల క్లబ్ లో చేరలేకపోతున్నాయి.

లేటెస్ట్ గా నాగార్జున తన కొడుకు నాగచైతన్య తో కలిసి నటించిన ‘బంగార్రాజు’ మూవీ కూడ 100 కోట్ల కలను నిజం చేయలేకపోయాయి. దీనితో వీరిద్దరూ ప్రస్తుతం నటిస్తున్న రెండు భారీ పాన్ ఇండియా మూవీల పై తమ ఆశలు పెట్టుకున్నారు. నాగార్జున నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈ సంవత్సరం పాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

నాగచైతన్య బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన ‘ఆ’ సింగ్ చద్దా’ కూడ ఈ సంవత్సరం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు పైనా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ రెండు మూవీలు ఊహించన స్థాయిలో ఘన విజయం సాదిస్తే నాగార్జున నాగాచైతాన్యలు ఒకేసారి తమ సినిమాలకు సంబంధించి 100 కోట్ల క్లబ్ చేరీ అలాంటి ఆర్డిన రికార్డును సొంతం చేసుకున్న తండ్రి కొడుకులు పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసే ఆస్కారం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే నాగార్జున నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఒక భారీ మల్టీ స్టారర్. ఆమూవీలో రణబీర్ కపూర్ అమితాబ్ లాంటి ప్రముఖులతో కలిసి నాగార్జున నటించాడు. ఆమూవీ సక్సస్ లో నాగార్జున కు ఎంతవరకు పేరు వస్తుంది అన్నది ప్రస్తుతానికి  చెప్పలేము. అదేవిధంగా నాగచైతన్య ‘లాల్ డింగ్ చద్దా’ మూవీలో అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తూ ఉండటంతో ఆమూవీ వల్ల ఎంతవరకు చైతన్యకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వస్తుంది సమాధానం లేని ప్రశ్న..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: