అరబిక్ కుతూ పాట.. తెలుగులో వచ్చేసిందోచ్?

praveen
ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు ఆ సినిమా నుంచి ఏదో ఒక పాట హిట్ అవ్వడం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల తమిళ హీరో ఇలయ తలపతి నటించిన బీస్ట్ సినిమా లోని అరబిక్ కుతూ పాట వచ్చి సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. చిన్నల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిని కూడా ఈ పాట ఆకర్షించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పాటలో అటు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు అయితే మరింతగా అందరినీ ఉర్రూతలూగించాయి.

 అయితే అరబిక్ కూతు పాట కన్నడ లాంగ్వేజ్ లో ఉన్నప్పటికీ అటు తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. అయితే ఈ పాట కాస్త తెలుగులో వస్తే ఇక మరింత పాటను ఆస్వాదించే వాళ్లం కదా అని తెలుగు ప్రేక్షకులు లందరు కూడా అనుకున్నారు. విజయ్ నటించిన బీస్ట్ సినిమాను  తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ లాంగ్వేజ్ లో విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన అరబిక్ కుతూ పాట తెలుగులో కూడా విడుదల చేశారు.

 తెలుగులో విడుదల చేసి అభిమానులందరికీ కూడా సర్ప్రైజ్ చేశారు.అయితే కన్నడ లాంగ్వేజ్ లో అరబిక్ కుతూ పాటని అటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాడారు. ఇక తెలుగు వెర్షన్ని శ్రీ సాయి కిరణ్ రాయగా.. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ క్రమంలోనే  ఈ పాట విన్న తర్వాత అదిరిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.  ఇక తెలుగు లాంగ్వేజ్ లో ఈ పాటకు మరింత ఆస్వాదించగలుగుతున్నాము అంటూ చెబుతున్నారు. అరబిక్ కూతు పాట యూ ట్యూబ్ లో 26.43 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. 5.5 మిలియన్ లైకులు కూడా సొంతం చేసుకుంది. ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విషయం తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: