'కేజిఎఫ్ 2' టీమ్ షాకింగ్ నిర్ణయం.. అక్కడ కూడా సినిమా విడుదల?
బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచిపోవడానికి దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు మరో సినిమా కోసం ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే కే జి ఎఫ్ 2.. ఈ సినిమా కూడా ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఏప్రిల్ 14వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. దాదాపు ఐదు భాషల్లో కూడా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రేక్షకులు అందరూ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. సాధారణంగా సౌత్ సినిమాలు అటు యూఎస్లో విడుదల అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 యూఎస్ తో పాటు గ్రీస్ లో కూడా విడుదల కాబోతుంది అని తెలుస్తోంది. దీంతో ఒక అరుదైన రికార్డును సాధించింది కేజిఎఫ్ 2 సినిమా. మొట్టమొదటిసారి ఒక సౌత్ ఇండియన్ మూవీ గ్రీస్ లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది అన్నది తెలుస్తుంది..