ఆ హీరోయిన్ కి షాక్.. ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్?

praveen
ఇటీవల టెక్నాలజీ పెరిగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి ఒకే రీతిలో టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇక ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఎప్పుడు ఎలా సైబర్ ఎటాక్ జరుగుతుందో తెలియక అందరూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. కేవలం సామాన్యులకు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలకు సైతం ఇలా సైబర్ నేరగాళ్ల నుంచి ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతోమంది సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే.



 నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరిగిపోయిన నేపథ్యంలో స్థానిక సెలబ్రిటీలకు విపరీతమైన క్రేజు వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే ఇక సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారూ ఎంతోమంది సైబర్ నేరగాళ్లు. ఆయా ఖాతాల నుంచి చిత్రవిచిత్రమైన పోస్టులు పెట్టడం లేదా సెలబ్రిటీలు మెసేజ్ చేస్తున్నట్లుగా ఇతరులకు మెసేజ్ చేసి డబ్బులు అడగడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక హీరోయిన్ కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.


 గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ నటి యామీ గౌతమ్.  ఇక ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల యామి గౌతం ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను యాక్సిస్ చేయలేక పోతున్నాను అంటూ యామిగౌతమ్ ప్రకటించింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది ఆమె. అంతే కాదు ఇక తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఏవైనా పోస్టులు అసాధారణ మెసేజ్ లు వస్తే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అంటూ యామి గౌతమ్ తన అభిమానులకు మిత్రులకి సూచించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: