ఇక ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల..ఆమె అందానికి టాలీవుడ్ యాత్ ఫుల్ ఫిదా అయిపోయింది. అందుకే వరుస అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ ఫాస్ట్ గా దూసుకుపోతోంది. అలాగే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా ఆమెకు ఆఫర్లు వచ్చే కొద్ది తన రెమ్యూనరేషన్ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతోంది.తాజాగా ఈ యంగ్ బ్యూటీ నితిన్ 32వ చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి ఇంకా సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు శ్రీలీల అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే నితిన్ మూవీకిగానూ శ్రీలీల ఏకంగా రూ. 1.25 కోట్లు డిమాండ్ చేసిందట. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చేందుకు ఒకే చెప్పారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది ఇంకా తెలియాలి.కాగా శ్రీలీల ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ హాట్ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజకు జోడీగా 'ధమాకా' అనే సినిమాలో నటిస్తోంది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.అలాగే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి డబ్యూ సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్ గా ఖరారు అయింది. రాధాకృష్ణ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాతో జెనీలియా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.