జూనియర్ తో ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఆలోచనలను బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో విమర్శకులు అసంతృప్తి వ్యక్త పరిచినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ పరుగులు తీస్తున్నాయి. ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటివారం ముగిసే సరికి 750 కోట్లు వసూలు చేసినట్లు చెప్తున్నారు. దీనితో ఈమూవీ ఫైనల్ రన్ పూర్తి చేసుకునేసరికి 1000 కోట్ల మార్క్ ను చాల సులువుగా అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం తారక్ రాజమౌళి ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అలా వెళ్ళిన సందర్భంలో వారి మాటల మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ సీక్వెల్ కు సంబంధించి జూనియర్ చరణ్ అభిమానుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞప్తుల పై సరదాగా చర్చ జరిగిందట. అక్కడే ఉన్న రచయిత విజయేంద్ర ప్రసాద్ కలగచేసుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ సీక్వెల్ ను ఎలా తీస్తే బాగుంటుందో సరదాగా వివరించరట.

రామ్ భీమ్ లు మళ్ళీ చేతులు కలిపి స్వాతంత్రోద్యమంలోని కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమంలో రామ్ భీమ్ లు కలిసి పాల్గొని ప్రజలను చైతన్యపరిచినట్లుగా ఊహాజనితమైన కథను అల్లవచ్చు అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన స్టోరీలైన్ తారక్ కు బాగా నచ్చిందట. అయితే మధ్యలో రాజమౌళి కలగచేసుకుని ఈవిషయాలు అన్నీ రెండు సంవత్సరాలు తరువాత ఆలోచించాలి అంటూ అప్పటికి ప్రేక్షకుల అభిరుచిని బట్టి కథను అల్లాలి అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసాడట.  

చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ తరువాత ‘బాహుబలి 3’ తీయమని రాజమౌళి పై ఒత్తిడి ఉంది. ఆమూవీని నిర్మించడానికి నిర్మాతలు కూడ సిద్ధంగా ఉన్నారు. అయితే ‘బాహుబలి 3’ తీస్తాను కానీ ఎప్పుడు తీస్తానో చెప్పలేను అని రాజమౌళి ఓపెన్ గానే చెపుతున్నాడు. ఇక ‘మహాభారతం’ కూడ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి చెపుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి ‘ఆర్ ఆర్ ఆర్’ సీక్వెల్ కూడ చేరితే రాజమౌళి తీయాలి అనుకున్న సినిమాల లిస్టు పెరుగుతుంది కానీ ఆ సినిమాలు అన్నీ ఎప్పుడు పూర్తి అవుతాయో జక్కన్నకి తెలియని పరిస్థితి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: