నితిన్ హీరోగా బన్నీ డైరెక్టర్ సెకండ్ మూవీ లాంచ్!
డైరెక్టర్ సురేందర్ రెడ్డి తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం వంశీకి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఇంకా అలాగే ఠాగూర్ మధు స్క్రిప్ట్ ను అందజేశారు.ఇక పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ నటి తన అందంతో తెలుగు యూత్ ని పిచ్చెక్కిస్తున్న కన్నడ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. ఇక అల్లు అర్జున్ తో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వక్కంతం వంశీ ఈ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి దమ్మున్న రచయితగా నిరూపించిన అతడు ఇప్పుడు దర్శకుడిగా నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.