ఈ హీరోలకు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ కోపమే..!

NAGARJUNA NAKKA
బాలకృష్ణ అభిమానులు, ఈ హీరోని డెమీగాడ్‌లా చూస్తుంటారు. బాలయ్య కనిపిస్తే చాలు పూనకాలతో ఊగిపోతుంటారు. అయితే ఒక్కోసారి ఈ మితిమీరిన అభిమానాన్ని తట్టుకోలేక, బాలయ్య అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అనుమతి లేకుండా ఫోటోలు తీస్తున్నాడని కూడా అభిమానిని కొట్టాడు బాలయ్య. అయితే పూరీ జగన్నాథ్‌ మాత్రం.. బాలయ్య కొట్టడాన్ని కూడా అభిమానులు ఎంజాయ్‌ చేస్తారని చెప్పాడు.
బాలీవుడ్‌లో వివాదాలకు చిరునామాగా కనిపించే హీరో సల్మాన్ ఖాన్. హిట్‌ అండ్‌ రన్‌, కృష్ణ జింకల వేట కేసులో అభియోగాలు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్, జర్నలిస్టులతో గొడవపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సైక్లింగ్‌ చేస్తున్నప్పుడు వీడియో తీస్తున్నాడని ఒక జర్నలిస్ట్ మొబైల్ ఫోన్‌ లాక్కున్నాడు సల్మాన్. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో ఒక అభిమాని సెల్ఫీ తీసుకుంటున్నాడని అతని ఫోన్‌ లాక్కున్నాడు.
షారుక్‌ ఖాన్‌ స్క్రీన్‌పై మిస్టర్‌ కూల్‌లా కనిపిస్తుంటాడు. కానీ ఈ హీరో కూడా కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయాడు. 'మాయా మేమ్‌సాబ్' సినిమాలో షారుక్, దీపా సాహి ఇంటిమేట్ సీన్స్‌ గురించి రాసిన మేగజీన్ ఆఫీస్‌ ముందు హంగామా చేశాడు. అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత ఫరా ఖాన్‌ భర్త శిరీష్ కుందర్, షారుక్ దీపావళి ఫ్లాపుల గురించి మాట్లాడాడని అతనితో గొడవపడ్డాడు.
సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌ జనాలని కొడితే, సైఫ్‌ అలీఖాన్‌ని ఒకళ్లు కొట్టారు. నైట్‌ క్లబ్‌లో ఒకతను తన గర్ల్‌ఫ్రెండ్‌తో సైఫ్‌ క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నాడని విస్కీ గ్లాస్‌తో సైఫ్‌ని కొట్టాడు. మరోసారి లక్నో చౌదరి చరణ్‌ సింగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో విఐపి లాంజ్‌ నుంచి సైఫ్‌ని బయటకి వెళ్లమన్నారని సెక్యూరిటీ గార్డ్స్‌తో గొడవపడ్డాడు.
గోవిందా ఒకసారి జర్నలిస్ట్‌ సంతోష్‌ రాయ్‌ని కొట్టిన కేసులో కోర్టుల చుట్టూ తిరిగాడు. అయితే నాలుగేళ్లు జైలు జీవితం గడపాల్సి వస్తుందనే భయంతో ఈ ఇష్యూని కోర్టు బయటే సాల్వ్ చేసుకున్నాడు గోవిందా. అలాగే ఎప్పుడూ కామ్‌గా కనిపించే అభిషేక్‌ బచ్చన్‌, ఒకసారి ఫోటోగ్రాఫర్ కెమెరా పగలగొట్టాడు. అయితే అమితాబ్ బచ్చన్ కొడుకు తరపున క్షమాపణలు చెప్పి కొత్త కెమెరా కొనిచ్చాక ఈ గొడవ సద్దుమణిగింది. సీనియర్ స్టార్ ధర్మేంద్ర దేవల్ కూడా జర్నలిస్ట్‌ని కొట్టి జైలుకి వెళ్లాడు. ధర్మేంద్ర భార్య, నాటి డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలినిని రాత్రి మిగిలిపోయిన ఇడ్లీలా పెర్ఫామ్‌ చేసిందని క్రిటిక్ దేవయాని చౌబల్‌ విమర్శించారు. ఆ కోపం మరో క్రిటిక్ క్రిష్ణపై చూపెట్టడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. ఆ తర్వాత ధర్మేంద్ర పోలీసుల ఎదుట లొంగిపోయి, బెయిల్‌పై బయటకొచ్చాడు. ధర్మేంద్ర కొడుకు సన్నీ దేవల్‌ ఫిల్మ్‌ మేకర్‌ కాంతి షాని కొట్టి వివాదాల్లో పడ్డాడు. సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక ధర్మేంద్రతో కొన్ని హార్స్‌ రైడింగ్‌ సీన్స్‌ షూట్‌ చేసి వాటిని సెక్స్‌ సీన్‌లో మిక్స్‌ చేశాడని కాంతిని కొట్టాడు. అలాగే మహేశ్‌ భట్‌ ఫిల్మ్‌ నుంచి డింపుల్‌ కిస్సింగ్‌ ఫోటోని లీక్‌ చేశాడని పి.ఆర్.వో హనీఫ్‌ జవేరిని పరుగులు పెట్టించాడు సన్నీ దేవల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: