RRR కలెక్షన్ లన్నీ ఫేక్ అంటూ ఫైర్ అవుతున్న కె.ఆర్.కె..!!
స్వయం ప్రకటిత వివాదాస్పద విమర్శకుడు అయినటువంటి కమల్ R ఖాన్ అకా KRK ఇలా విమర్శించడంలో మొదటి స్థానంలో ఉంటారు. ఆయన ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన నంబర్ లపై తన ఆలోచనలను ఇలా పంచుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద ఈ కలెక్షన్ లన్నీ బూటకం అంటూ ఆయన కొట్టి పడేశాడు. KRK మాట్లాడుతూ ఆర్.ఆర్.ఆర్ సినిమా సాధించిన కలెక్షన్ల గురించి తనదైన శైలిలో తిప్పి కొట్టడం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చూపించిన నంబర్లను ప్రస్తావిస్తూ ఇవన్నీ ఫేక్ కలెక్షన్ లు అంటూ కొట్టిపారేశాడు. అయితే ఇతని వాదనలు విన్న నెటిజన్లు మాత్రం పెద్దగా ఏకీభవించడం లేదని తెలుస్తోంది.
ఆయన మొదటిసారి ట్వీట్ చేసినప్పుడు ప్రజలు ఆర్.ఆర్.ఆర్ సినిమాను పూర్తిగా తిరస్కరించారు . ఇది భారీ ఫెయిల్యూర్ చిత్రం.. అయితే పెయిడ్ మీడియా ద్వారా ఫేక్ రిపోర్టింగ్ చేయిస్తున్నారు అని.. మేకర్స్ కూడా ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్నారు అని.. రకరకాలుగా తన మాటలతో విమర్శించడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది.. నేను నా తదుపరి సమీక్షలో ఈ విషయాన్ని నిరూపిస్తాను.. రూ. 680 కోట్ల భారీ బడ్జెట్ ను ఎలా లెక్కించాలో ప్రజలకు తెలియదా అంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. కేఆర్కే చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.