పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే, ఈ సినిమా దాదాపు యాభై శాతం వరకు పూర్తి అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాపై దృష్టి పెట్టడం, క్రిష్ జాగర్లమూడి 'కొండపొలం' సినిమాను తెరకెక్కించడం ద్వారా హరిహర వీరమల్లు సినిమా 50 శాతం వరకు షూటింగ్ పూర్తి అయిన తర్వాత వాయిదా పడింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా ను విడుదల చేసి ఉండడం, క్రిష్ జాగర్లమూడి కూడా కొండపొలం సినిమా విడుదల చేసి ఉండడంతో తిరిగి హరిహర వీరమల్లు మూవీ ని మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా హరి హర వీరమల్లు సినిమా గురించి రైటర్ సాయిమాధవ్ బుర్రా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు, సాయిమాధవ్ బుర్రా చెప్పిన విషయాలు హరిహర వీరమల్ల సినిమా పై అంచనాలు పెంచేశాయి, హరిహర వీరమల్లు మూవీ గురించి సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించే పాత్ర, ఇంత వరకూ ఇలాంటి జోనర్ లో పవన్ కళ్యాణ్ పాత్ర చేయలేదు. ప్రతీ అభిమాని గర్వంగా చెప్పుకునే పాత్ర, ఫోక్, జానపదం జానర్ లో ఈ మూవీ ఉంటుంది అని సాయిమాధవ్ బుర్రా తెలియజేశాడు, ఇలా హరిహర వీరమల్లు సినిమా గురించి సాయిమాధవ్ బుర్రా చెప్పిన మాటలతో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.