పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. తెలుగులో వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు ప్రేక్షకులను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అలరిస్తున్న నేపథ్యంలో తెలుగు హీరోలు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. ఆవిధంగా తమ చిత్రాలు కూడా ఏదో ఒక రకంగా పేరు తెచ్చుకోవాలని చెప్పి హీరోలు సైతం భారీ స్థాయిలో ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే చాలామంది ఆరవ హీరోలు తెలుగు మార్కెట్ పై కన్నేశారు.
ముందుగా తెలుగులో మార్కెట్ ను సంపాదించుకుని ఆ తర్వాత నేషనల్ సినిమాలు చేయాలి అనేది వారి ప్లాన్. అందుకే ఎప్పుడూ లేని విధంగా తెలుగు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అలా ధనుష్ హీరోగా 2 తెలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ద్విభాషా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలు రెండు కూడా మంచి విజయం సాధిస్తే తెలుగులో ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడుతుందని భావిస్తున్నాడు.అలా ఇక్కడ మార్కెట్ ఏర్పడిన తర్వాత ఆయన పాన్ ఇండియా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా ఆయన కొన్ని సినిమాలను చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే తెలుగు లో పెద్ద మార్కెట్ కోసమే ఇలా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విజయ్ దళపతి, శివ కార్తికేయన్ వంటి హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య కూడా ఓ తెలుగు సినిమా చేయడానికి ఓ అగ్ర దర్శకుడి తో మంతనాలు జరుపుతున్నాడు. శివ కార్తికేయన్ అనుదీప్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ విధంగా తమిళ హీరోలు తెలుగు హీరోల ను కాపీ కొట్టి సినిమాలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారు ఎంతటి స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాలి.