ఎన్టీఆర్, రాజమౌళి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హిందీ నటుడు..!

Anilkumar
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్ ఆర్ ఆర్ సినిమా నార్త్ నుండి సౌత్ దాకా దీని హవానే నడుస్తోంది.అయితే బాలీవుడ్‌లో వంద కోట్లు దాటేసిన ఈ సినిమా  ఇప్పటివరకు ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా వుండగా తాజాగా ఈ సినిమాపై ప్రముఖ నటుడు మకరంద్‌ దేశ్‌పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నాకు రాజమౌళి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ రావడంతో అక్కడిని వెళ్లాను.ఇకపోతే  అప్పటికే నాకోసం రామ్‌చరణ్‌, రాజమౌళి ఎదురుచూస్తున్నారు. ఇక నేను వెళ్లగానే చరణ్‌ తనను తాను పరిచయం చేసుకున్నాడు.


అయితే బాహుబలితోనే దేశ ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నాడు రాజమౌళి. ఇక ఆయన కష్టస్వభావి, ముక్కుసూటి మనిషి. ఎన్నిరోజులనేది నేను చెప్పలేను కానీ నా సినిమాలో మీరుండాలని ఆయన నాతో అన్నాడు. ఇకపోతే సినిమాలో నాకు మంచి రోల్‌ ఇచ్చారు కానీ చాలావరకు నా సన్నివేశాలు కట్‌ చేశారు. అయితే నిజానికి రాజమౌళి సర్‌ ముందు ఒక చిన్న సినిమా తీద్దామనుకున్నాడు. ఇక అది కూడా లవ్‌ స్టోరీ. కానీ రాజమౌళి భార్య నీకు ఏదైతే బెస్ట్‌ అనిపిస్తుందో అది చేయమని సూచించింది. కాగా దీంతో ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ మీద ఫోకస్‌ చేశాడు.


ఇకపోతే  అతడి ఆలోచనలు పెద్దవి, అందుకోసం ఎంతో కష్టపడ్డాడు కూడా! అనుకున్నట్టుగానే ఆ మూవీ రికార్డులు సృష్టిస్తోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్‌ భుజాలపై రామ్‌చరణ్‌ ఎక్కి ఫైట్‌ చేసే సన్నివేశం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుంది. ఇక సెట్స్‌లోకి నేను వెళ్లగానే ఎన్టీఆర్‌ లేచి నిలబడి నన్ను కూర్చోమనేవారు. ఇకపోతే ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడేవాడు. అయితే తారక్‌ ట్రక్‌లో నుంచి క్రూరమృగాలతో పాటు బ్రిటీష్‌ సౌధంలోకి దూకే సీన్‌ అంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పుకొచ్చాడు ఈయన.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి పై మకరంద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: