మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా సినిమా 'గని' కి మేకర్స్ థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీగానే అంచనాలు పెట్టుకోవడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'గని'. బాక్సింగ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలే వున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ హీరోయన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ సినిమా థిమేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దూ ముద్ద అల్లు బాబి సంయుక్తంగా నిర్మించారు.
ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ ని ఏప్రిల్ 8 వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మొదలైంది.నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకి 25 కోట్లు వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. శాటిలైట్ డిజిటల్ డబ్బింగ్ రైట్స్ పరంగా ఈ భారీ మొత్తం కూడా మేకర్స్ సొతం చేసుకున్నారు.అయితే థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనడంతో 50 కోట్లకు అమ్మేయాలని అంత రావాలని మేకర్స్ ఎంతగానో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారట. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరుగుతుందా? లేదా అనేది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది.ఇక చూడాలి ఈ సినిమా వరుణ్ తేజ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో మరి.