RRRలో తారక్, చరణ్ హీరోలని తెలీదు : శ్రియ

Purushottham Vinay
ప్రస్తుతం దేశమంతటా కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించే చర్చ నడుస్తుంది.ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ అద్భుత నటనతో ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ కు కారణమయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ తల్లి పాత్రలో శ్రియ నటించారనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా మీడియాతో ముచ్చటించిన శ్రియ శరన్ ఆర్ఆర్ఆర్ మూవీకి తనకు టికెట్లు దొరకడం లేదని ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని ఆమె వెల్లడించారు. ఛత్రపతి సినిమా తర్వాత రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేయడం సంతోషాన్ని కలిగిస్తోందని శ్రియ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సరోజిని పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియ ఛత్రపతి సినిమా తన కెరీర్ లో పెద్ద సూపర్ హిట్ అని అన్నారు.ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని అలా ఎదురుచూస్తున్న సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో సరోజిని పాత్ర దక్కిందని శ్రియ అన్నారు. 



భవిష్యత్తులో కూడా అవకాశం వస్తే రాజమౌళి సినిమాల్లో కచ్చితంగా నటిస్తానని రాజమౌళి బృందంతో మరోసారి కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. యస్ యస్ రాజమౌళి సినిమా అనగానే ఈ సినిమాకు సంతకం చేశానని ఈ సినిమాలో నటీనటులెవరనే విషయం కూడా అసలు అడగలేదని ఆమె అన్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత చరణ్, తారక్ ఈ సినిమాలో హీరోలని తెలిసిందని అప్పటి దాకా కూడా అసలు ఈ విషయం తనకు తెలియదని శ్రియ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్, తారక్ స్టార్ డమ్ కు సరిపడా హిట్ వచ్చిందని ఆమె తెలిపారు. వచ్చే వారమైనా ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్లు దొరుకుతాయని ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. శ్రియ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన ఈ కామెంట్లు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: